“సడక్ 2” ట్రైలర్ కు డిస్ లైకుల వరద.!

Published on Aug 12, 2020 4:31 pm IST

బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం అనంతరం బాలీవుడ్ సినీ వర్గాల్లో ఒక్కసారిగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. నెపోటిజం అనే మాట మరింత స్థాయిలో వినిపించడం మొదలయ్యింది. దీనితో సుశాంత్ సానుభూతిపరులు అతని మరణానికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక దీనితో పాటు బాలీవుడ్ లో ఇతర స్టార్ హీరో, హీరోయిన్లు మరియు నిర్మాతల సినిమాలు తమ సినిమాలు విడుదల చేసుకునే పనిలో ఉన్నారు. అలా తాజాగా నెపోటిజంకు సంబంధించి మొదటి నుంచీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేష్ భట్ తెరకెక్కించిన “సడక్ 2” ట్రైలర్ నేడు విడుదల అయ్యింది.

మహేష్ భట్ మరియు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రభర్తిలకు సంబంధించి పలు అంశాలు కూడా బయటకొస్తున్నాయి. దీనితో సుశాంత్ అభిమానులు మరియు సానుభూతిపరులు ఈ ట్రైలర్ కు ఊహించని రేంజ్ లో డిస్ లైక్స్ తో షాకిచ్చారు. కేవలం ఒక్క గంటలోనే లక్షకు పైగా డిస్ లైకులు కొట్టారు. లైక్స్ కు మరియు డిస్ లైక్స్ కు 70 శాతానికి పైగా తేడా ఉంది. దీనిని బట్టి ఈ సినిమాపై ఏ రేంజ్ లో నెగెటివిటి ఏర్పడిందో మనం అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :

More