ఫస్ట్ సినిమాకే ‘అఖిల్’కి రికార్డ్ ఓపెనింగ్స్

ఫస్ట్ సినిమాకే ‘అఖిల్’కి రికార్డ్ ఓపెనింగ్స్

Published on Nov 12, 2015 8:04 PM IST

akhil
అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడవతరం నతవారసుడుగా పరిచయం అవుతూ కహిల్ అక్కినేని చేసిన మొదటి సినిమా ‘అఖిల్’. దీపావళి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సినీ ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. టాక్ అలా ఉన్నా అంచనాలు ఎక్కువ ఉండడం దానికి దీపావళి సీజన్ తోడవడం వలన మొదటి రోజు అఖిల్ సినిమా రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ ని సాధించింది. మొదటి రోజు అఖిల్ వరల్డ్ వైడ్ గా సుమారు 9.5 కోట్ల షేర్ మార్క్ ని కలెక్ట్ చేసింది.

ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్న సమాచారం ప్రకారం అఖిల్ కి ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఏ స్టార్ హీరో వారసుడికి మొదటి రోజు ఈ రేంజ్ ఓపెనింగ్స్ రాలేదు. కానీ అఖిల్ కి మాత్రం ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం అందరినీ షాక్ కి గురిచేస్తోంది. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. నితిన్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ – తమన్ కలిసి మ్యూజిక్ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు