బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన సల్మాన్ !

Published on Jun 6, 2019 7:27 pm IST

కండలవీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి తన స్టామినా ఏమిటో నిరూపించుకున్నారు. ఆయన కొత్త చిత్రం ‘భారత్’ నిన్న ఈద్ సందర్బంగా విడుదలైంది. మొదట్లో వరల్డ్ కప్ టోర్నీలో ఇండియా మొదటి మ్యాచ్ ఆడుతుండటం వలన కలెక్షన్లు దెబ్బతింటాయేమోననే అనుమానం అందరిలోనూ కలిగింది. చివరికి చిత్ర యూనిట్ సభ్యుల్లో కూడా. కానీ భాయ్ క్రేజ్ ముందు అవేవీ పనిచేయలేదు.

సినిమా నిన్న మొదటి రోజు దేశవ్యాప్తంగా 42 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరిచింది. సల్మాన్ గత హిట్ చిత్రాలతో పోల్చుకున్నా ఇవే ఉత్తమమైన ఓపెనింగ్స్ కావడం విశేషం. ఇక హెవీ పాజిటివ్ టాక్ ఉండటం, రాబోయేది వీకెండ్ కావడంతో వసూళ్లు ఇలాగే కొనసాగే అవకాశముంది. ఫుల్ రన్ ముగిసేనాటికి బాలీవుడ్ గత చిత్రాలు రికార్డులన్నీ బ్రేక్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని టి సిరీస్, సల్మాన్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More