ఓటిటిలో “నిశ్శబ్దం” రికార్డ్ రిలీజ్ అట.!

Published on Sep 25, 2020 7:00 am IST

మన దక్షిణాది సూపర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మెయిన్ లీడ్ లో నటించిన మరో లేటెస్ట్ చిత్రం “నిశ్శబ్దం”. హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ఈ చిత్రం చాలా కాలం సస్పెన్స్ అనంతరం నేరుగా ఓటిటి విడుదలకు రెడీ అయ్యింది. ముందు అంతా థియేట్రికల్ రిలీజ్ కె స్టిక్ అయ్యారు కానీ ఇప్పుడు ఎంతకు పరిస్థితులు చక్కబడకపోయే సరికి అమెజాన్ ప్రైమ్ తో డీల్ కుదుర్చుకొని ఓటిటి విడుదలకు మొత్తం సెట్ చేసారు.

అలా ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పటి వరకు మన దగ్గర చాలా చిత్రాలు డిజిటల్ రిలీజ్ అయ్యాయి కానీ నిశ్శబ్దం కాస్త స్పెషల్ అని అంటున్నారు. ఈ చిత్రాన్ని మొదట మొత్తం 5 భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

కానీ ఇపుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మొత్తం మూడు భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నట్టు టాక్. తెలుగు తమిళ్ మరియు మళయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుందట. ఇప్పటి వరకు మన తెలుగు కానీ తమిళ్ కానీ దక్షిణాదిలో ఇలా చేయలేదు. సో ఇది ఒక రికార్డు రిలీజ్ అని పరిగణించబడుతుంది. ఈ చిత్రంలో అనుష్క సరసన మాధవన్ మేల్ లీడ్ లో నటించగా అంజలి మరియు షాలిని పాండేలు మరో కీలక పాత్రలలో కనిపిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More