రికార్డు ధరకి “లైగర్” నాన్ థియేట్రికల్ హక్కులు..డీటెయిల్స్ ఇవే.!

Published on May 3, 2022 2:00 pm IST

తన సినిమా అర్జున్ రెడ్డి తో మన టాలీవుడ్ యూత్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమా “లైగర్” కోసం అందరికీ తెలిసిందే. మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ క్రేజీ యాక్షన్ డ్రామా బిజినెస్ పరంగా భారీ మొత్తంలో పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.

లేటెస్ట్ గానే నాన్ థియేట్రికల్ హక్కుల్లో ఆడియో రైట్స్ కి గాను సోనీ మ్యూజిక్ వారు 14 కోట్లు పెట్టి కొనుగోలు చెయ్యగా నాన్ థియేట్రికల్ హక్కలు గాను అన్ని భాషల్లో కలిపి 85 కోట్లకి ఈ సినిమా రైట్స్ ని వారు కొనుగోలు చేశారట. దీనితో ఈ సినిమాకి ఈ డీల్ పూర్తయ్యింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి థియేట్రికల్ హక్కులు బిజినెస్ అయితే ఇంకా పూర్తి అవ్వలేదట. దీనిపై ఒక క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి. మరి ఈ సినిమాకి ఛార్మి మరియు ధర్మ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :