రికార్డ్ స్థాయిలో రిలీజ్ కానున్న ‘భరత్ అనే నేను’ !

10th, April 2018 - 04:22:04 PM

ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఉన్న తారాస్థాయి క్రేజ్ ను, అంచనాల్ని దృష్టిలో పెట్టుకుని ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని అన్ని ఏరియాల్లోని డిస్ట్రిబ్యూటర్లు భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎలాగూ సినిమాకు పెద్ద విడుదల దక్కనుండగా అమెరికాలో విడుదల తేదీ ముందురోజు రాత్రి 2000ల ప్రీమియర్లను ప్రదర్శించనున్నారు.

ఇక ఆస్ట్రేలియాలో కూడ ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా విడుదలకాని రీతిలో సుమారు 45 లొకేషన్లలో రిలీజ్ చేయనున్నారు. చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడ ఎక్కువ మొత్తంలో జరగడంతో తొలిరోజే వీలైనంత మొత్తాన్ని ఓపెనింగ్స్ రూపంలో వెనక్కి రాబట్టుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు చూస్తున్నారు.

హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతున్న దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దానయ్య నిర్మించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రి పాత్ర్రలో కనిపించనున్నారు.