యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కెరీర్ కి చాలా కీలకం అయిన సినిమా మరియు తన కెరీర్లో వస్తున్న 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’. మరి కొద్ది సేపట్లో సెన్సార్ పూర్తి చేసుకోనున్న ఈ సినిమా జనవరి 13న భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. సంక్రాంతి సీజన్ లో ముందు వస్తున్న సినిమా ఇదే కావడం వలన మొదటి రోజు భారీ కలెక్షన్స్ రాబట్టుకోవడం కోసం మొదటి రోజు అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుండడం విశేషం. ముఖ్యంగా నైజాంలో నాన్నకు ప్రేమతో థియేటర్స్ సంఖ్య అందరినీ షాకింగ్ కి గురి చేస్తోంది.
ప్రస్తుతం మాకు అందిన సమాచారం ప్రకారం ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఒక్క నైజాంలోని 400 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రిలీజ్ సమయానికి ఈ 400 థియేటర్స్ కి ఇంకో 30 లేదా 40 థియేటర్స్ కలిసే అవకాశం ఉందని నైజాం డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. అంతే కాకుండా హైదరాబాద్ లోని ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో సుమారు 8 సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. వాటిల్లో ఒక్క థియేటర్ లో తప్ప మిగతా అన్ని థియేటర్స్ లో నాన్నకు ప్రేమతో రిలీజ్ కానుండడం విశేషం. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు నైజాంలో ఏ స్థాయిలో నాన్నకు ప్రేమతో రిలీజ్ అవుతోందని.. ఒక్క నైజాంలోనే కాకుండా ఆంధ్ర, ఓవర్సీస్ లలో కూడా ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జోడీ కట్టింది.


