చరణ్, శంకర్ ల భారీ ప్రాజెక్ట్ లో కియారాకి రికార్డ్ రెమ్యునరేషన్!

Published on Aug 11, 2021 10:00 am IST


ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ “రౌద్రం రణం రుధిరం” షూట్ లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.. ఉక్రెయిన్ దేశంలో జరుగుతున్నటువంటి షూట్ లో చరణ్ చురుగ్గా పాల్గొంటున్నాడు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం తర్వాత మరో సెన్సేషనల్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ దర్శకుడు శంకర్ తో చేయనున్న సంగతి కూడా తెలిసిందే.. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.

అయితే ఈ చిత్రంలో చరణ్ కి బ్యూటిఫుల్ జోడి అయినటువంటి కియారా అద్వానీని మేకర్స్ ఫిక్స్ చెయ్యగా ఇపుడు ఈ చిత్రానికి ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది అన్నది తెలుస్తుంది. మన టాలీవుడ్ వరకు అయితే ఈమెకి దక్కింది మరో రికార్డు స్థాయి రెమ్యునరేషన్ అని తెలుస్తుంది. మరి ఈ చిత్రానికి ఆమె ఎంత తీసుకుంటుంది అంటే 3 కోట్ల 75 లక్షలని తెలుస్తుంది. ఇది మన టాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాల్లో టాప్ 3 లో ఒకటి టాక్. మరి ఈ చిత్రంలో కియారా ఎలాంటి రోల్ లో కనిపించనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :