ఏఎంబి సినిమాస్ లో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ కి రికార్డు స్థాయిలో షోస్ పడనున్నాయి !

Published on Jan 8, 2019 12:18 pm IST

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’. ఈ చిత్రంలోని మొదటి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ రేపు భారీ స్థాయిలో విడుదలకానుంది. ఇక ఈ చిత్రానికి మహేష్ బాబు మల్టీ ఫ్లెక్స్ థియేటర్ ఏఎంబి సినిమాస్ లో మొదటి రోజు రికార్డు స్థాయిలో షోస్ పడనున్నాయి. అక్కడ 32షోలను వేయాలని కంఫర్మ్ చేయగా తాజాగా మరో మూడు ఎక్స్ట్రా షో లను కలుపుకొని మొత్తం 35షోస్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ మొదటి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవిత విశేషాలను చూపించనున్నారు.

క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ , రానా , సుమంత్ ,రకుల్ ప్రీత్ సింగ్ , నిత్య మీనన్ , హన్సిక అతిధి పాత్రల్లో నటించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More