రామ్ రెడ్ మూవీపై లేటెస్ట్ అప్డేట్

Published on Nov 14, 2019 2:39 pm IST

రామ్ ఎనర్జీకి డైనమిక్ డైరెక్టర్ పూరి టేకింగ్ జతైతే బాక్సాఫీస్ ఏరేంజ్ లో పేలుతుందో ఇస్మార్ట్ శంకర్ మూవీ నిరూపించింది. టాలెంట్ కి తగ్గ హిట్ లేక సతమతమవుతున్న వీరిద్దరికీ ఇస్మార్ట్ శంకర్ మూవీ అపూర్వమైన విజయం అందించింది. రామ్ ఇస్మార్ట్ శంకర్ మూవీ తో వచ్చిన విజయ పరంపరని కొనసాగించాలని అనుకుంటున్నాడు. అందుకే కథల ఎంపిక విషయంలో పక్కా గా ఉండాలని భావిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ విడుదలైన దాదాపు నాలుగు నెలల విరామం తరువాత రెడ్ మూవీని ప్రకటించారు.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ నేడు ప్రారంభమైనది. ఈ మూవీ కొరకు దర్శకుడు లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. రెడ్ తమిళ సూపర్ హిట్ చిత్రం తాడం కి తెలుగు రీమేక్. కాగా రామ్ ఈ చిత్రంలో మొదటి సారి డ్యూయల్ రోల్ చేయనున్నారు. ఇక వచ్చే ఏడాది వేసవి కానుకగా రెడ్ మూవీ విడుదలయ్యే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :

More