ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న అజిత్ “తునివు”.!

Published on Feb 3, 2023 10:00 am IST

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా మంజు వారియర్ ఫీమేల్ లీడ్ లో నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రం “తునివు” కోసం తెలిసిందే. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ చిత్రం అజిత్ కెరీర్ లో భారీ హిట్ గా నిలిచింది. దీనితో ఈ సినిమా ఇప్పటికీ తమిళ నాట మంచి రన్ తో కొనసాగుతూ ఉండగా ఇప్పుడు ఈ సినిమాపై లేటెస్ట్ ఓటిటి అప్డేట్ అయితే కన్ఫర్మ్ అయ్యింది.

మరి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ ఓటిటి యాప్ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి అందులో ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 8 నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేయనున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ వారు పొందుపరిచారు. దీనితో ఈ చిత్రం ఆరోజు నుంచి రానుంది. మరి ఇది తమిళ్ మరియు తెలుగు వెర్షన్ లు రెండిటి లోనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించగా బోనీ కాపుర నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :