అవైటెడ్ “లవ్ టుడే” తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.!

అవైటెడ్ “లవ్ టుడే” తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Nov 19, 2022 10:53 AM IST

రీసెంట్ గా తమిళ నాట రిలీజ్ అయ్యి భారీ హిట్ అయ్యినటువంటి యూత్ ఫుల్ సూపర్ హిట్ చిత్రం “లవ్ టుడే”. యంగ్ హీరో హీరోయిన్ లు ప్రదీప్ రంగనాథన్ మరియు ఇవానా లు నటించిన ఈ చిత్రాన్ని ప్రదీప్ రంగనాథన్ నే దర్శకత్వం వహించాడు. మరి తమిళ నాట సూపర్ టాక్ తో సాలిడ్ రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రాన్ని అయితే నిర్మాత దిల్ రాజు వెంటనే తెలుగు డబ్బింగ్ రైట్స్ ని కొనుగోలు చేసేసారు.

దీనితో తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి ఆసక్తిగా మారిన ఈ చిత్రం లేటెస్ట్ ట్రైలర్ తో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం తెలుగు రిలీజ్ డేట్ అధికారికంగా అనౌన్స్ చేసుకుంది. మేకర్స్ అయితే ఈ చిత్రాన్ని ఈ నవంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసేసారు.

మరి ఇక తెలుగులో ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. యూత్ అయితే ఈ సినిమా కోసం బాగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి అయితే యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు