రాఘవ లారెన్స్ “రుద్రుడు” కి రిలీజ్ డేట్ ఫిక్స్..!

రాఘవ లారెన్స్ “రుద్రుడు” కి రిలీజ్ డేట్ ఫిక్స్..!

Published on Oct 1, 2022 3:00 PM IST

హారర్ కానీ మంచి యాక్షన్, డాన్స్ చిత్రాల్లో ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్ కి ఒక స్పెషల్ మార్క్ ఉందని చెప్పాలి. అలా ప్రస్తుతం అయితే లారెన్స్ దర్శకునిగా సహా హీరోగా కూడా పలు చిత్రాలు చేస్తుండగా ఈ చిత్రాల్లో ఇప్పుడు “రుద్రుడు” అనే చిత్రం రిలీజ్ కి సిద్ధం అయ్యినట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు.

దర్శకుడు కదిరేశన్ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ ఎంటర్టైనర్ ని మేకర్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నట్టుగా ఇప్పుడు అయితే ఓ ఇంటెన్స్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు. అయితే ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా ఫైవ్ స్టార్ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. అలాగే జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ్ సహా కన్నడ మరియు మళయాళ భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు