సూర్య మరో సినిమా విడుదల తేది కూడా ఫిక్స్ ?

Published on Mar 26, 2019 11:37 pm IST

స్టార్ హీరో సూర్య నటించిన మచ్ అవైటెడ్ మూవీ యెన్ జి కె మే 31న విడుదలకానుందని తెలిసిందే. ఇక ఈ చిత్రం తోపాటు సూర్య ప్రస్తుతం కాప్పాన్ చిత్రంలో నటిస్తున్నాడు. కెవి ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తుది దశకు చేరుకుంది. తాజాగా ఈ చిత్రం యొక్క విడుదలతేది కూడా ఖరారు చేశారట మేకర్స్. కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం ఆగస్టు 30న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుందంట. సెప్టెంబర్ 2న వినాయక చవితి ని క్యాష్ చేసుకోవాలని ఈ విడుదలతేదిని ఫిక్స్ చేసినట్టు సమాచారం. అయితే ఈ విడుదల తేది ఫై అధికారిక ప్రకటన వెలువబడాల్సి వుంది.

ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రధాన మంత్రి గా నటిస్తుండగా ఆర్య , బోమన్ ఇరానీ , ఆర్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :

More