నితిన్ “మాస్ట్రో”కి ఓటిటి రిలీజ్ టైం ఫిక్స్ అయ్యిందా.?

Published on Jun 26, 2021 9:00 am IST

యూత్ స్టార్ నితిన్ హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “మాస్ట్రో”. దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ చిత్రంపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో తమన్నా కూడా కీలక పాత్రలో నటిస్తుంది. మరి కొన్ని రోజులు కితమే మొత్తం షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నేరుగా ఓటిటిలో విడుదల కానుంది అని తెలిసింది.

అలాగే ఈ చిత్రం ఎక్స్ క్లూజివ్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ రిలీజ్ కానుంది అని తెలిపాము. మరి ఈ చిత్రానికి వారు భారీ మొత్తంలోనే ఆఫర్ చెయ్యగా ఆ డీల్ కుదుర్చుకుని ఎప్పుడు ఈ చిత్రం విడుదల అవుతుంది అన్నది తెలుస్తుంది. ఈ చిత్రాన్ని మేకర్స్ హాట్ స్టార్ లో ఆగష్టు నెలలో రిలీజ్ చేసే ప్లాన్ ఉన్నారట. అలాగే అది రెండో వారంలో ఉండొచ్చేమో అని తెలుస్తుంది. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం అందివ్వగా శ్రేష్ట్ మూవీస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :