పవన్ ఫ్యాన్స్ కి రిలీఫ్.. వైరల్ అవుతున్న కథలో నిజం లేదు!

పవన్ ఫ్యాన్స్ కి రిలీఫ్.. వైరల్ అవుతున్న కథలో నిజం లేదు!

Published on Mar 6, 2026 3:59 PM IST

ustaad-bhagat-singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ఓ వారం ముందే థియేటర్స్ లో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యలో ఈ సినిమా కథకి సంబంధించి ఓ టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమా రీమేక్ కాదు అని ముందు నుంచి చెబుతూనే వస్తున్నారు. కానీ మధ్యలో బుక్ మై షో యాప్ లో విజయ్ నటించిన తేరి కథ లైన్ ని పొందుపరచడంతో సోషల్ మీడియాలో మొత్తం చక్కర్లు కొట్టేసింది.

ఈ సినిమా మళ్ళీ రీమేక్ అంటూ ప్రచారం మొదలైంది. ఇక ఫైనల్ గా బుక్ మై షో వారు ఈ సినిమా కథని అప్డేట్ చేశారు. ఈసారి దానికి పూర్తిగా భిన్నమైన లైన్ తో అప్డేట్ చేయడంతో ఇది ఫ్యాన్స్ కి కొంచెం రిలీఫ్ అని చెప్పొచ్చు. దీనితో మిగతా ఫ్యాన్స్ కూడా కొంచెం అత్యుత్సాహం తగ్గించుకోవాలని కూడా ఇతర అభిమానులు మనవి చేసుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్, థమన్ లు సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మార్చ్ 19న సినిమా రిలీజ్ కి రాబోతుంది.

ubs 2

సంబంధిత సమాచారం

తాజా వార్తలు