తన రెండు లగ్జరీ కార్లను అమ్మేసిన రేణు దేశాయ్?

Published on Aug 11, 2020 2:44 pm IST

ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ మరియు ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య ఓ బాధ్యత గల తల్లిగా రేణు దేశాయ్ తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఎలాంటి కాంట్రవర్సీల జోలికి పోకుండా చాలా సింపుల్ గా జీవనం సాగిస్తున్న రేణు దేశాయ్ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు.ఎప్పుడూ ఎన్నో ఆసక్తికర అంశాలను పంచుకునే రేణు దేశాయ్ ఈసారి కూడా అలాంటి ఆసక్తికర అంశాన్ని పంచుకున్నారు.

తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తన ఫాలోవర్స్ కు ఒక రిక్వెస్ట్ చేసారు. మాములుగా పెట్రోల్ మరియు డిజిల్ తో నడిచే కార్ల కంటే కూడా విద్యుత్ తో నడిచే కార్లను వినియోగించమని చెప్తున్నారు. అందులో భాగంగా ముందు తానే తన లగ్జరీ కార్లు అయినటువంటి ఆడి ఏ6 మరియు పోర్ష్ బాక్స్టెర్ ను అమ్మి కొత్త ఎలెక్ట్రిక్ కారును కొనుకున్నానని తెలిపారు. దీనికి అంతటికి ప్రధాన కారణం తన వంతుగా తాను పర్యావరణంలో కార్బన్ ను తగ్గించడం కోసమే అని ఆమె తెలిపారు. తాను చదివిన ఓ కథనం ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు.

సంబంధిత సమాచారం :

More