దయచేసి అలాంటి పోస్టులు పెట్టకండి – రేణూ దేశాయ్

దయచేసి అలాంటి పోస్టులు పెట్టకండి – రేణూ దేశాయ్

Published on May 11, 2025 8:59 PM IST

renu desai

పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ భారత్‌-పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం పై పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. భారత్‌-పాకిస్థాన్ మ‌ధ్య ప‌రిస్థితులు దారుణంగా మారిన స‌మ‌యంలో సోషల్ మీడియాలో భారత్‌, పాక్‌కు సంబంధించిన వార్ వీడియోలు, ఫొటోలతో కూడిన పోస్టులు ఎక్కువ‌గా వైరల్ అయ్యాయి. ఐతే, కొంద‌రు యుద్ధంపై ఫ‌న్నీ వీడియోలు చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి పోస్ట్ ల పై తాజాగా నటి రేణు దేశాయ్ ఓ పోస్ట్ పెట్టారు.

ఇంతకీ, రేణు దేశాయ్ ఏం పోస్ట్ పెట్టారంటే.. ‘ప్రస్తుతం భారత్‌-పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధ ప‌రిస్థితులు తీవ్రత‌ర‌మ‌వుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో కొంత‌మంది వ్యూస్ కోసం ఫ‌న్నీ రీల్స్, వీడియోలు చేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ రోజు మ‌నం భ‌యంలేకుండా మ‌న ఇళ్లల్లో నిద్రపోతున్నామంటే.. దానికి కార‌ణం బార్డర్‌లో సైనికులు త‌మ ప్రాణాల‌కు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారు కాబ‌ట్టే. దయచేసి వారి, వారి కుటుంబ స‌భ్యుల బాధ‌ను అర్థం చేసుకోండి. మ‌న ప్రార్థన‌లే వారికి అండ‌. ఇలాంటి సున్నిత‌మైన‌ స‌మ‌యంలో మ‌నం ఐక్యంగా ఉండాలి. స‌బ్‌స్క్రైబ‌ర్లను పెంచుకోవాల‌నో, ఎక్కువ‌గా వ్యూస్ రావాల‌నో వార్‌పై ఫ‌న్నీ రీల్స్, వీడియోలు చేయ‌డం కరెక్ట్ కాదు’ అని రేణు దేశాయ్ త‌న పోస్టులో తెలిపారు.

తాజా వార్తలు