పెళ్ళికి ముందే కీలక నిర్ణయం తీసుకున్న రేణు దేశాయ్ ?

Published on Jul 24, 2018 12:58 pm IST

పవన్ కళ్యాణ్ నుండి విడిపోయాక చాలా సంవత్సరాలు పిల్లలతో కలిసి ఒంటరిగానే ఉంటూ వచ్చిన రేణు దేశాయ్ ఈ మధ్యే తన కొత్త జీవిత భాగస్వామిని ఎంచుకున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఆమె తన రెండో వివాహానికి ముందే ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. సినీవర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం తాను మళ్ళీ సినిమాల్లో నటించాలని ఆమె నిర్ణయించుకున్నారట. కాకపొతే పెళ్లికి ముందా, లేక పెళ్లి తర్వాత నటిస్తారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

కాగా రేణు దేశాయ్ గతంలో ‘బద్రి, ‘జానీ’ చిత్రాల్లో పవన్ కళ్యాణ్ సరసన నటించారు. ఇటీవల బుల్లితెర పై ఓ రియాలిటీ షోలో ఆమె జడ్జిగా వ్యవహరించారు. అలాగే ఆమె కొన్ని చిత్రాలను కూడా నిర్మించారు. ఇప్పుడు మళ్ళీ నటన పై ఆమె మనసు మళ్లినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :