పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “ది రాజా సాబ్” (The Raja Saab). భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాని దర్శకుడు మారుతి తెరకెక్కించగా నిన్న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాకి నైజాం మార్కెట్ లో ఊహించని రీతి పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అక్కడ ప్రీమియర్స్ సరైన ప్లానింగ్ తో పడలేదు. ఇది డిజప్పాయింటింగ్ అంశం అయినప్పటికీ డే 1 కి మంచి ఓపెనింగ్స్ అక్కడ రాజా సాబ్ అందుకున్నట్టు వినిపిస్తుంది.
Raja Saab day 1 in Nizam – నైజాంలో మొదటి రోజు రాజా సాబ్ వసూళ్లు
ప్రభాస్ కి ఉన్న స్ట్రాంగ్ మార్కెట్ జోన్ లలో నైజాం కూడా ఒకటి. తన గత అన్ని సినిమాలకి భారీ ఓపెనింగ్స్ అక్కడ దక్కాయి. ఇప్పుడు ఇలానే రాజా సాబ్ (The Raja Saab in Nizam) కి కూడా మంచి ఓపెనింగ్స్ దక్కినట్టు పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. దీని ప్రకారం రాజా సాబ్ మొత్తం 22.50 కోట్ల గ్రాస్ (జి ఎస్ టి కలిపి) అందుకున్నట్టు తెలిసింది. సో ఇది మంచి నెంబర్ అనే చెప్పాలి.
ఇంకా ఎక్కువే వచ్చి ఉండేవా?
డెఫినెట్ గా ఈ సినిమా మొదటి రోజు ఇంకా ఎక్కువే రాబట్టే ఛాన్స్ ఉంది కానీ చివరి నిమిషంలో సస్పెన్స్ నెలకొనడం ప్రీమియర్స్ కూడా సరిగ్గా పడకపోవడం మూలాన దెబ్బ పడింది. లేదంటే ఇంకో 10 కోట్లు మార్జిన్ ఈజీగా ఉండి ఉండేది.


