కొనసాగుతున్న మెగాస్టార్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్.!

Published on Jun 27, 2021 1:44 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమా మరింత స్పెషల్ గా మారడానికి కారణం మెగాస్టార్ ఆల్ టైం హిట్ సంగీత దర్శకుడు మణిశర్మ కూడా అని చెప్పాలి. వీరి కాంబోలో అని అప్పుడు టాక్ వచ్చినపుడే మరిన్ని అంచనాలు నమోదు అయ్యాయి.

మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ అదరగొట్టింది. ఇప్పుడు లేటెస్ట్ గా 60 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి మరో ఫీట్ ను సెట్ చేసింది. ఇక అలాగే మరో పక్క చరణ్ మరియు పూజాల మధ్య సెట్ చేసిన రొమాంటిక్ నెంబర్ కూడా త్వరలోనే వస్తుంది అని టాక్ ఉంది. మరి అది ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. భారీ అంచనాలు ఏర్పర్చుకున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :