నిర్మాతలకు లాభసాటిగా మారిన ‘రాజుగారి గది-2’ !
Published on Oct 16, 2017 11:54 am IST

ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున అక్కినేని, సమంత అక్కినేని ప్రధాన పాత్రల్లో నటించిన ‘రాజుగారి గది -2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండమైన వసూళ్లను రాబడుతోంది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా ఆ తర్వాత తర్వాత పుంజుకుని మొత్తం మూడురోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.9.52 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

నాగార్జున, సమంతల పెర్ఫార్మెన్స్, కథలోని ఎమోషనల్ కంటెంట్ సినిమాను కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేశాయి. దీంతో సినిమా యొక్క శాటిలైట్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు, హిందీ శాటిలైట్ రైట్స్ రూ.9 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. దీంతో చిత్రం నిర్మాతలకు మంచి లాభాల్ని చేకూర్చునట్లైంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం సినిమా క్లోజింగ్ వసూళ్లు కూడా భారీ స్థాయిలోనే ఉండనున్నాయి.

 
Like us on Facebook