వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హీరో అవతారం ఎత్తబోతున్నారు. ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్బంగా ఆర్జీవీ తాను హీరోగా నటించబోయే సినిమా పేరు ‘కోబ్రా’ అని రివీల్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశాడు.
అలాగే ఈ చిత్రానికి పనిచేస్తున్న సాంకేతిక బృందాన్ని కూడా ఆర్జీవీ పరిచయం చేసాడు. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తోన్నట్లు తెలిపాడు.
కీరవాణి మాట్లాడుతూ.. ఈ సినిమా వర్మగారికి ప్రత్యేకమైన సినిమా అని తెలిపారు. అలాగే వర్మగారు జీవితంలో నటించరు, మరి ఈ సినిమాలో ఎలా నటిస్తారో చూడాలి అని.. ఇక నేను ఇప్పటివరకూ ఇవ్వని యాంగిల్ లో ఈ సినిమాకి మ్యూజిక్ చెయ్యబోతున్నాని తెలిపారు.
మొత్తానికి వర్మ డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా రానిస్తాడేమో చూడాలి. అయితే వర్మ ‘కోబ్రా’ లాంటి సినిమాలు చెయ్యటానికే వర్మ గన్ షాట్ ఫిలిమ్స్ బ్యానర్ ను స్థాపించినట్లు చెప్పుకొచ్చాడు.


