వర్మ పవన్ పేరుతో మరోసారి హల్ చల్!

వర్మ పవన్ పేరుతో మరోసారి హల్ చల్!

Published on Dec 9, 2015 3:17 PM IST

rgv1
రామ్ గోపాల్ వర్మ.. ఒకప్పుడు ఈ పేరు అంటే సెన్సేషనల్ మూవీ డైరెక్టర్.. కానీ ఇప్పుడు ఆ పేరు వింటే.. ఫ్లాప్ సినిమాలు, ట్విట్టర్ లో వార్తల్లో నిలవడానికి ఆయన ట్విట్టర్ లో వేసే వివాదాస్పద వ్యాఖ్యలే కనిపిస్తాయి. టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఎప్పటి కప్పుడు పలు కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు వర్మ. అలా తాజాగా చెన్నై వరదలను బేస్ చేసుకొని, పవన్ కళ్యాణ్ 2 కోట్లు విరాళం ఇచ్చాడు అంటూ సెన్సేషన్ క్రియేట్ చేసాడు.

‘పవన్ కళ్యాణ్ చెన్నై బాధితుల కోసం 2 కోట్లు ఇచ్చాడని వినడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ విషయంలో రజినీకాంత్ 10 కోట్లు ఇవ్వడం కన్నా పవన్ కళ్యాణ్ 2 కోట్లు ఇవ్వడమే ఎక్కువ. రజినీకాంత్ తమ ప్రజల కోసం అంత ఇచ్చాడు, కానీ పవన్ మాత్రం మానవత్వం కోసం అంత ఇచ్చాడు. అందుకే పవర్ స్టార్ కి నా సెల్యూట్’ అని వర్మ ట్వీట్స్ వేసాడు. కానీ ఈ వార్తల్లో నిజం లేదు, అలాగే ఎలాంటి అధికారిక ప్రకటన కూడా లేదు. కేవలం వర్మ పవన్ పేరుని క్యాష్ చేసుకోవడం కోసం చెన్నై వరదలని కూడా వాడుకోవడం కరెక్ట్ కాదని విమర్శకులు అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు