‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’లో ఆర్జీవీ చేస్తున్నది ఎవరి క్యారెక్టర్ ?

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’లో ఆర్జీవీ చేస్తున్నది ఎవరి క్యారెక్టర్ ?

Published on Nov 6, 2019 7:59 PM IST

Kamma Rajyam Lo Kadapa Redd

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమా తీస్తూ, దానికి సంబంధించిన పాటలు, పొస్టర్లు, టీజర్ వదులుతూ హడావుడి చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ చిత్రం ప్రస్తుత ఏపీ రాజకీయాల్లోని ప్రధాన వ్యక్తుల, రాజకీయ పార్టీల ఆధారంగా రూపొందుతుండటంతో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయింది. తాజాగా ఈ సినిమా గురించి అప్డేట్ పెట్టిన వర్మ అందులో తన ఫొటోను పెట్టి సినిమాలో కొత్త నటుడు. నాకు తెలిసిన ఒక వ్యక్తిని పోలి ఉన్నాడు. కానీ అతనెవరో గుర్తు రావడంలేదు. మీరు గుర్తుపట్టగలరా అంటూ ట్వీట్ చేశారు.

దీంతో ఇంతకీ వర్మ ఎవరి పాత్ర పోషిస్తున్నాడు అనే చర్చ మొదలైంది ప్రేక్షకుల్లో. కొందరేమో అది వర్మ నిజ జీవిత పాత్ర అయ్యుంటుందేమో అంటున్నారు తప్ప ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. మరి వర్మ కనిపించబోయేది ఎవరి పాత్రలోనో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలి. టైగర్ కంపెనీ, అజయ్ మసూర్ ప్రొడక్షంన్స్ సంస్థలతో కలిసి వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విషయంలో వర్మ మీద కొందరు పోలీస్ కేసులు కూడా పెట్టగా విడుదల నాటికి ఇంకెన్ని వివాదాలు చుట్టుముడతాయో మరి.

తాజా వార్తలు