పవన్ కళ్యాణ్ సునామీ లా…భీమ్లా నాయక్ పై ఆర్జీవీ ఇంట్రస్టింగ్ కామెంట్స్!

Published on Feb 25, 2022 1:40 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హ్యండ్సం హంక్ రానా దగ్గుపాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నేడు థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మేరకు సినిమా పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ మేరకు ప్రముఖ వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ భీమ్లా నాయక్ సినిమా పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. భీమ్లా నాయక్ ఉరుము లాంటి వాడు అంటూ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ సునామీ లా ఉన్నారు అని, రానా దగ్గుపాటి మెడకు మెడ అంటూ చెప్పుకొచ్చారు. మొత్తం మీద పెద్ద భూకంపం లా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఆర్జీవీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :