‘జయలలిత’ తరువాత ‘వర్మ’ టార్గెట్ ‘కేసీయారే’ !

Published on Apr 2, 2019 11:07 pm IST

తెలుగునాట బయోపిక్ లు వర్మకు కలిసి వచ్చినట్లుగా ఇంకెవ్వరికీ కలిసి రాలేదనే చెప్పాలి. ఇప్పటికే క్రిష్ ఎన్టీఆర్ జీవితచరిత్రను బయోపిక్ రూపంలో చూపించే ప్రయత్నం చేసినా.. అది అస్సలు వర్కౌట్ కాలేదు. కానీ అదే ఎన్టీఆర్ జీవితంలో చివరి రోజుల్లో జరిగిన సంఘటనల ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ను తీసి వర్మ బాగానే లాభాలను గండించాడు.

కాగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారికి శశికళకి మధ్య ఉన్న రిలేషన్ ను బేస్ చేసుకుని ఓ సినిమా చేస్తున్నాడు. జయలలిత మరణానికి సంబంధించి ఉన్న అనుమానులనే ప్రధాన నేపథ్యంగా తీసుకుని.. ఆ అంశాన్నే హైలెట్ చేస్తూ సినిమా తీస్తుండటంతో ఆ సినిమా పై కూడా తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో బాగానే ఆసక్తి పెరుగుతుంది.

ఇక జయలలిత తరువాత వర్మ టార్గెట్ ‘కేసీయారే’ అంటా. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సారధిగా కేసీఆర్ ను వర్మ చూపించనున్నారట. జయలలిత బయోపిక్ తరువాత కేసీఆర్ బయోపిక్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద సినిమాలను అలాగే కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు.

సంబంధిత సమాచారం :