18 షార్ట్ ఫిల్మ్స్ ను పబ్లిష్ చేసిన రామ్ గోపాల్ వర్మ

Published on Jul 4, 2021 10:03 pm IST

రామ్ గోపాల్ వర్మ తాజాగా స్పార్క్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కండక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కాంటెస్ట్ కోసం మొత్తం 9,000 షార్ట్ ఫిల్మ్స్ నుండి 18 ఎంపిక అయ్యాయి. అయితే అందుకు సంబంధించిన వాటిని నేడు రామ్ గోపాల్ వర్మ స్పార్క్ వరల్డ్ యూ ట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే అందులో బూడిదలో పోసిన పన్నీరు, రిటెన్ బై, టాంగిల్డ్, కోవిడ్ పారడాక్స్, ఫస్ట్ నైట్, మన్యం, ఐ డు లవ్, మీనా, ఇల్లీగల్, ఏ ట్రిప్, 2027, స్పార్క్ వర్సెస్ వరల్డ్, కోవిడ్ రిలేషన్, ఫియర్, మ్యానుఫ్యాక్చర్డ్ కరోనా, ఓహ్ నో, కర్మ ఈజ్ ఏ కోవిడ్, కోవిడెవిల్ లు ఉన్నాయి. అయితే ఈ 18 షార్ట్ ఫిల్మ్స్ కూడా రెండు నిమిషాల విడిది లో ఉన్నాయి. అయితే రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ప్రయత్నం తో పలువురు కొత్త దర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :