మన బిడ్డకు 30 ఏళ్లు – రామ్ గోపాల్ వర్మ

Published on Oct 5, 2019 11:54 am IST

దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ స్టేచర్ ఈనాటికీ ఏమాత్రం తగ్గకపోవడానికి కారణం ‘శివ’. తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమా ఒక మాస్టర్ పీస్.అలాంటి ఈ సినిమా విడుదలై నేటికి 30 ఏళ్లు కావొస్తోంది. ఈ సందర్బంగా వర్మ ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘నాగార్జునా.. ఇవాళ మన ప్రియమైన బిడ్డ 30వ పుట్టిన రోజు’ అంటూ ట్వీట్ చేశాడు.

దర్శకులుగా రాణిస్తున్న, రాణించాలనుకుంటున్న
చాలమందికి ఇదొక గైడ్. ఈ చిత్రంలోని కెమెరా వర్క, సౌండ్ డిజైనింగ్, నటీనటుల పెర్ఫార్మెన్స్ అన్నీ ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తుంటాయి. అందుకే ఇదొక క్లాసిక్. ఈ సినిమాతోనే నాగార్జున, వర్మల పేర్లు దేశవ్యాప్తంగా వినబడ్డాయి. ఈ సినిమా సృష్టించిన అలజడితో అప్పటి వరకు తెలుగు పరిశ్రమలో చలామణీలో ఉన్న అనేక సాంప్రదాయ పద్దతులకు చెక్ పడి కొత్త ఒరవడి మొదలైందని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం :

More