మ్యారేజ్ సీన్స్ షూట్ చేస్తున్న ఆర్జీవి.

మ్యారేజ్ సీన్స్ షూట్ చేస్తున్న ఆర్జీవి.

Published on Mar 3, 2015 2:00 PM IST

rgv-nandoo

నందు, అనైకా జంటగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘365 డేస్’. పెళ్లి తర్వాత ప్రేమ ఎలా ఉంటుంది అనే కథాంశంతో ఈ సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం మెయిన్ లీడ్ పై పెళ్లి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ప్రేమికుల రోజు కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్, సాంగ్ యువతను ఆకట్టుకున్నాయి. వర్మ మార్క్ రొమాన్స్ ఆ సాంగులో కనిపించింది. ఇప్పటివరకు కెరీర్లో మాఫియా, హారర్, థ్రిల్లర్, ఎరోటిక్ కథలతో సినిమాలను తీసిన వర్మ, తొలిసారిగా పూర్తి స్థాయి ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు. వర్మ కెరీర్లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుందని చిత్ర బృందం భావిస్తుంది. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి వర్మ సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు