ఎన్టీఆర్ గురించి వర్మ చూపించేవి ఇవేనా !

Published on Dec 31, 2018 12:00 am IST

రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను శరవేగంగా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే విడుదల చేసిన వెన్నుపోటు సాంగ్ లో వర్మ నేరుగా చంద్రబాబు నాయుడిని కించపరుస్తూ లిరిక్స్ పెట్టాడు, దాంతో తెలుగు తమ్ముళ్ళు ఒక్కసారిగా తమ ఆగ్రహాన్ని వర్మ పై వ్యక్తం చేశారు. అయితే కేవలం పబ్లిసిటీ కోసమే వర్మ అలా సాంగ్ ను రూపొందించారట.

సినిమాలో ప్రధానంగా ఎన్టీఆర్ వెన్నుపోటు ఘట్టం కంటే కూడా.. తెలుగు వెండితెర ఆరాధ్య దైవంగా కోట్లాది ప్రజలు చేత గౌరవింప బడ్డ ఎన్టీఆర్.. ఒక సామాన్య స్త్రీని.. అందులో అరవై సంవత్సరాల వయసులో ఆయనకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, లక్ష్మి పార్వతిలో ఆయన్ని అంతగా ఆకట్టుకున్న అంశం ఏమిటి, లాంటి అంశాలను వర్మ విశ్లేషాత్మకంగా ఈ చిత్రంలో చూపించనున్నాడు.

సంబంధిత సమాచారం :