మనసు మార్చుకిని తన సినిమా టైటిల్ మారుస్తున్న ఆర్జీవీ

Published on Jun 15, 2021 1:40 am IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొదలుపెట్టిన చిత్రం ‘దిశ ఎన్ కౌంటర్’. ఆనంద్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన ఒక వాస్తవ ఘటన ఆధారంగా ఈ చిత్రాని తెరకెక్కించారు. అయితే సినిమా మొదలైనప్పటి నుండి సినిమా చుట్టూ వివాదాలు తిరుగుతూనే ఉన్నాయి. తమ అనుమతి లేకుండానే తమ కుమార్తె జీవితం గురించి సినిమా తీయటం పట్ల దిశ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో వాదనలు నడిచాయి.

తాజాగా వర్మ ఈ సినిమా గురించి స్పందించారు. సినిమాకు రెండు నెలల క్రితమే సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయని, చిన్న చిన్న కట్స్, టైటిల్ మార్పును సూచించారట సెన్సార్ బోర్డ్ సభ్యులు. తనకు, తన బృందానికి న్యాయపరమైన విధానాల మీద గౌరవం ఉందని, వివాదాస్పదమైన తన ప్రతి చిత్రం లీగల్, సెన్సార్ విధానాలకు లోబడే వెళ్తాయని, వారిని సంతృప్తిపరిచాకనే విడుదలవుతాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు కోవిడ్ కారణంగా సినిమా హాళ్లు మూతబడటంతో రిలీజ్ ఆగిందని అన్నారు. దీన్నిబట్టి వర్మ సినిమా పేరును మార్చనున్నట్టు స్పష్టమవుతోంది.

సంబంధిత సమాచారం :