వర్మ ‘కేసీయార్’ను కూడా వదలడంటా ?

Published on Mar 26, 2019 11:05 am IST

తెలుగునాట బయోపిక్ లకు పెద్దగా ఆదరణ దక్కకపోయినప్పటికీ.. కొంతమంది దర్శకులు ఇంకా ప్రముఖ వ్యక్తుల జీవితాలను బయోపిక్ రూపంలో తెరకెక్కించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తాజాగా వివాదాల దర్శకుడు రామ గోపాల్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సారధి కేసీఆర్ బయోపిక్ ను కూడా తన తరువాత చిత్రంగా తియ్యబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

మరి కేసీఆర్ పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి. అలాగే రామ్ గోపాల్ వర్మ ఈ బయోపిక్ ను ఎప్పుడు మొదలు పెడతారో ఇతర నటీనటులుగా ఎవర్ని తీసుకుంటారో చూడాలి. ఇక ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తో మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని వర్మ తీసిన ఈ చిత్రం కొన్ని సెన్సార్ ఇబ్బందులు ఎదుకున్నప్పటికీ.. చివరికి విడుదలకు సర్వం రంగం సిద్ధం చేసుకుంది.

సంబంధిత సమాచారం :

More