
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సచిన్ జోషి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. హైదరాబాద్ శివార్లలో రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. 1987లో విడుదలైన హాలీవుడ్ సినిమా ‘ఫాటల్ అట్రాక్షన్’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ కు రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుందని సమాచారం. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా కథలో మార్పులు చేశారట.
రామ్ గోపాల్ వర్మ టిపికల్ స్టైల్లో రొమాంటిక్ సన్నివేశాలను జత చేశారట. మీరా చోప్రా, కైనాత్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మీరా చోప్రా పాత్రకు కథలో చాలా ప్రాముఖ్యత ఉందట. మార్క్ రామ్ గోపాల్ వర్మ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

