డిసెంబర్ 6న ‘బ్యూటిఫుల్’ !

Published on Nov 11, 2019 11:00 pm IST

రాంగోపాల్ వర్మకు చెందిన టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకం పై రూపొందిన తాజా చిత్రం ‘బ్యూటిఫుల్’. (ట్రిబ్యూట్ టు రంగీలా ఉప శీర్షిక). నైనా కథానాయికగా, సూరి కధానాయకుడిగా నటించారు. అగస్త్య మంజు దర్శకుడు. కాగా ఈ చిత్రం డిసెంబర్ 6న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడిస్తూ… ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కి, మొదటి సింగల్ కి విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే.

రొమాంటిక్ ప్రేమ కధాంశంతో వైవిధ్య భరితంగా ఈ చిత్రాన్ని మలిచాం. సూరి, నైనా తమ పాత్రలలో ఒదిగిపోయారు. సన్నివేశాలతో పాటు పాటలు హత్తుకుంటాయి అని తెలిపింది. ఈ చిత్రానికి పాటలను సిరా శ్రీ అందించగా…సంగీతాన్ని రవి శంకర్ సమకూర్చారు. ఈ చిత్రానికి సమర్పణ: టి.అంజయ్య, నిర్మాతలు: టి నరేష్ కుమార్, టి.శ్రీధర్, సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, రచన, ఫోటోగ్రఫీ, దర్శకత్వం: అగస్త్య మంజు.

సంబంధిత సమాచారం :

More