బంధువు మరణంతో ఎమోషనలైన ఆర్జీవీ !

Published on May 24, 2021 1:53 pm IST

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ బంధువు పి.సోమశేఖర్‌ కరోనాతో మృతి చెందారు. ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఆయన కరోనా చికిత్స పొందుతూ ఉండగా, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌ పై చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. కాగా సోమశేఖర్‌ రంగీలా, దౌడ్‌, సత్య, జంగల్‌, కంపెనీ వంటి పలు సినిమాల నిర్మాణ బాధ్యతలు చూసుకున్నారు.

ఆయన ‘ముస్కురాకే దేఖ్‌ జర’కు అనే హిందీ సినిమాకి దర్శకుడిగా కూడా పని చేశాడు. పి.సోమశేఖర్‌ మరణం పట్ల ఆర్జీవీ ఎమోషనల్‌ అవుతూ..”కొన్నేళ్లుగా తను మాతో లేడు. ఇతర బిజినెస్ ల్లోకి వెళ్లడంతో చాలా కాలంగా మాకు దూరంగా ఉంటున్నాడు. నా లైఫ్ లో సోమశేఖర్‌ చాలా కీలకమైన వ్యక్తి. అతడిని చాలా మిస్‌ అవుతున్నాను’ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ‘123తెలుగు.కామ్’ నుండి పి.సోమశేఖర్‌ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం :