తన సినిమా టైటిల్లతో, తనకు మాత్రమే వచ్చే విలక్షణ ఐడియాలతో రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తాడు. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ నవదీప్ తోనని దానిపేరు ఐస్ క్రీమ్ అని ప్రకటించాడు
మనం సినిమాలో సమంత స్నేహితురాలిగా నటించిన తేజస్వి ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమాను కేవలం 3నెలలో ముగిస్తానని ఆర్.జి.వి తెలిపాడు
ఈ సినిమా జోనర్ ఇంకా ప్రకటించలేదు. రామూ అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ సినిమాను తీస్తాడని అందరూ ఆశిస్తున్నారు. విజయం, పారజయం అనేవి పట్టించుకోని ఆర్.జి.వి ని ఈసారన్నా హిట్ పలకరిస్తుందేమో చూడాలి


