సుశాంత్ ప్రియురాలు రియా అకౌంట్ లో కోట్ల నగదు.

Published on Aug 2, 2020 8:36 pm IST

సుశాంత్ సింగ్ ఆత్మ హత్య కేసులో తవ్వేకుంది, నిజాలు బయటికి వస్తున్నాయి. సుశాంత్ మరణంలో అతని ప్రేయసి రియా చక్రవర్తి పాత్ర ఉంది అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇక ఈ కేసు విషయంలో బీహార్ పోలీసులు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. బీహార్ పోలీసులు సుశాంత్ బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తున్నారు. కాగా గత మూడు నెలల్లో మూడు కోట్ల రూపాయలు సుశాంత్ అకౌంట్ నుండి రియా చక్రవర్తి అకౌంట్ కు బదిలీ అయినట్లుగా గుర్తించారని తెలుస్తుంది. సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ ఇప్పటికే 15 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసును పెట్టడం జరిగింది. సుశాంత్ క్రెడిట్ కార్డ్ ను కూడా రియా చక్రవర్తి వాడుకుందని, ఆమె అకౌంట్స్ కు డబ్బు బదిలీ అవ్వడంతో పాటు తన ప్రతి షాపింగ్ అవసరాన్ని కూడా సుశాంత్ అకౌంట్ నుండి వినియోగించుకుందని కేకే సింగ్ ఆరోపిస్తున్నాడు.

అలాగే రియా చక్రవర్తి కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది . కనీసం ఒక స్థాయి హీరోయిన్ గా కూడా గుర్తింపు తెచ్చుకోని రియా అకౌంట్ లో కోట్ల రూపాయల బ్యాలన్స్ ఎలా వచ్చింది అనే కోణంలో విచారణ సాగుతుంది. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి మరిన్ని సమస్యల్లో ఇరుక్కోవడం ఖాయంగా కనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More