రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్ ఇలా అన్నింట్లోనూ తన ప్రతిభను చాటుకున్న నేషనల్ అవార్డ్ విన్నర్ రిషబ్ శెట్టి, ప్రస్తుతం నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ దర్శకత్వానికి దూరం అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కాంతార: చాప్టర్ 2’ పనులు అప్పుడే మొదలయ్యాయని ఆయన ధృవీకరించారు. ఒకవైపు నటుడిగా తన ఇతర చిత్రాల షూటింగ్‌లలో పాల్గొంటూనే, మరోవైపు తన రైటర్స్ టీమ్‌తో కలిసి ఈ సినిమా స్క్రిప్ట్‌ను డెవలప్ చేస్తున్నట్లు రిషబ్ వెల్లడించారు.
ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ చిత్రాన్ని రిషబ్ శెట్టి ముందుగా పూర్తి చేయనున్నాడు. ఆ తర్వాత ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తాడు. ఈ రెండు సినిమాలకు వేర్వేరు ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్, వైవిధ్యమైన లుక్స్ అవసరం కావడంతో వీటిని ఒకేసారి షూట్ చేయడం కుదరదని ఆయన స్పష్టం చేశాడు. ఈ చిత్రాల షూటింగ్ జరుగుతున్నంత కాలం బ్యాక్‌గ్రౌండ్‌లో ‘కాంతార: చాప్టర్ 2’ స్క్రిప్ట్ వర్క్ మాత్రం నిరంతరాయంగా సాగుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.


