గ్రోక్ మాస్.. ‘రాబిన్ హుడ్’ ప్రమోషన్స్ అదుర్స్!

గ్రోక్ మాస్.. ‘రాబిన్ హుడ్’ ప్రమోషన్స్ అదుర్స్!

Published on Mar 18, 2025 8:06 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో యూత్ స్టార్ నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “రాబిన్ హుడ్” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి వస్తున్న ప్రమోషన్స్ సహా కంటెంట్ మంచి హిట్ కూడా అయ్యాయి.

ఇలా లేటెస్ట్ గా టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారిన ఏఐ గ్రోక్ ని కూడా మేకర్స్ క్రేజీ ప్రమోషన్స్ కి వాడేశారు. అది ఇస్తున్న మాస్ రిప్లైస్ తో తమ సినిమా ట్రైలర్ లాంచ్ కోసం ముహుర్తాన్ని అడగడం ఆ వీడియో వదలడం మంచి ఎంటర్టైనింగ్ గా మారింది. ఇలా మొత్తానికి మాత్రం ప్రమోషన్స్ పరంగా మేకర్స్ ఎక్కడా తగ్గడం లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రం ట్రైలర్ ఈ మార్చ్ 21 సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా దీనితో అనౌన్స్ చేశారు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.


సంబంధిత సమాచారం

తాజా వార్తలు