రజినీ ‘రోబో 2.0’ నేటి నుంచే మొదలు!!

రజినీ ‘రోబో 2.0’ నేటి నుంచే మొదలు!!

Published on Dec 16, 2015 8:27 AM IST

robo2
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ మాఫియా డాన్ గా కనిపించనున్న ‘కబాలి’ షూటింగ్ ని ఫినిష్ చేసేసాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా వెంటనే తన తదుపరి సినిమాని మొదలు పెట్టనున్నాడు. రజినీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘రోబో’ సినిమా సీక్వెల్ లో రజినీకాంత్ నటించనున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని డిసెంబర్ 12న గ్రాండ్ గా లాంచ్ చేయాలనుకున్నారు. కానీ చెన్నైలో వచ్చిన వరదల వల్ల చాలా సింపుల్ గా పూజ ఫినిష్ చేసేసారు. అలాగే పూజ చేసిన 4 రోజులు తర్వాత అనగా డిసెంబర్ 16 నుంచి షూటింగ్ మొదలు పెడతారని మేము ఇది వరకే తెలిపాం.

మేము చెప్పిన దాని ప్రకారమే నేటి నుంచి రజినీకాంత్ – శంకర్ ల ‘రోబో’ సీక్వెల్ షూటింగ్ మొదలవుతోంది. ఈ విషయాన్ని శంకర్ కూడా తెలిపాడు. ‘2.0 షూటింగ్ ఈ రోజు నుంచి మొదలవుతుంది, నేను చాలా ఉత్కంఠగా ఉన్నానని’ శంకర్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. దీని ప్రకారం రోబో సీక్వెల్ కి ‘రోబో 2.0’ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 3డి ఫార్మాట్ లో తీయనున్న ఈ సినిమాని ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసాడు. ఇంటర్నేషనల్ యాక్టర్స్ తో పాటు పలువురు స్టార్స్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు.

తాజా వార్తలు