2.0 ట్రైలర్ ను గ్రాండ్ గా విడుదల చేయనున్నారు !

2.0 ట్రైలర్ ను గ్రాండ్ గా విడుదల చేయనున్నారు !

Published on Oct 30, 2018 1:53 AM IST

2.0
2.0 చిత్రం విడుదలకోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ చిత్రం అంచనాలను మరితంగా పెంచింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ చిత్రం యొక్క ట్రైలర్ కూడా విడుదల కానుంది. నవంబర్ 3న ఈ ట్రైలర్ ను చెన్నై లో ఉదయం గ్రాండ్ గా ఈవెంట్ ను నిర్వహించి చిత్రానికి పనిచేసిన నటీనటులు సాంకేతిక నిపుణల సమక్షంలో విడుదల చేయనున్నారు.

క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ , అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ ముఖ్య పాత్రల్లో నటించారు. అత్యంత భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నఈ చిత్రం నవంబర్ 29న భారీ స్థాయిలో విడుదల కానుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు