శంకర్ ‘రోబో-2’కి ముహూర్తం కుదిరిందా.?

శంకర్ ‘రోబో-2’కి ముహూర్తం కుదిరిందా.?

Published on Sep 3, 2015 10:00 AM IST

Rajini-kanth

భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రజినీకాంత్. ఆయన సినిమాలు అన్నీ సౌత్ ఇండియన్ భాషల్లోనూ రిలీజ్ అయ్యి ప్రభంజనం సృష్టిస్తుంటాయి. అలాంటి సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లో టాప్ 5 లో నిలిచే సినిమా ‘రోబో’. భారీ బడ్జెట్ తో మునుపెన్నడూ చూడని గ్రాండ్ విజువల్స్ తో వచ్చిన ఈ సినిమాకి సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకుడు. ఈ ఏడాది శంకర్ ఐ’ సినిమాతో ఆకట్టుకున్నాడు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన మరోసారి రజినీకాంత్ తో కలిసి ‘రోబో 2’ చేయనున్నాడనే విషయం మనకు తెలిసిందే.

తాజాగా ‘రోబో 2’ కి సంబందించిన స్క్రిప్ట్ సిద్దమవ్వడం, ఫుల్ స్క్రిప్ట్ ని శంకర్ రజినీకాంత్ కి చెప్పడం, ఆ స్క్రిప్ట్ కి రజినీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయిందని తెలియజేశాం. తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి ముహూర్తం కుదిరిందా.? అంటే అవుననే అంటున్నాయి తమిళ మీడియా వర్గాలు. ముందుగా 2016 జనవరి నుంచి అనుకున్నారు. కానీ ఒకనెల ముందే అనగా డిసెంబర్ నుంచే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారని సమాచారం. రోబో 2 కథ కోసం శంకర్ మొదటిసారి మలయాళ ఫేమస్ నవలా రచయిత, స్క్రీన్ ప్లే రైటర్ బి. జేయమోహన్ తో కలిసి వర్క్ చేసాడు. రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో ఈ నెలలోనే శంకర్ మిగిలిన ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టనున్నాడు. అలాగే ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఈ విజువల్ ఎఫెక్ట్స్ పై కూడా వర్క్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు