రణవీర్ సింగ్ మరియు అలియా భట్ నటించిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ, జూలై 28న థియేటర్ల లో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమా నాలుగో రోజు 7 కోట్లు వసూలు చేయగా, నిన్న మరో 7.30 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. దీంతో సినిమా మొత్తం ఇప్పుడు 60 కోట్లకు చేరింది.
పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో రొమాంటిక్ డ్రామా థియేటర్ల వద్ద జనాలను ఆకర్షిస్తోంది. రోజురోజుకు ఈ సినిమాకి సంబంధించిన మౌత్ టాక్ పెరుగుతూనే ఉంది. మరోవైపు, స్టార్ హీరోయిన్, కంగనా రనౌత్ ఈ చిత్రం మానిప్యులేటివ్ హిట్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా సినిమాకు మంచి పబ్లిసిటీ మాత్రమే ఇస్తున్నారే తప్ప మరేమీ లేదని కరణ్ జోహార్ సూపర్ థ్రిల్ అయ్యాడు. మరి రానున్న రోజుల్లో ఈ సినిమా ఎంత వసూళ్లు సాధిస్తుందో చూడాలి.


