రోజా సెల్వమణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు – ఏ ఎమ్ ఫెరోజ్

Published on Jul 4, 2021 4:25 pm IST

నదీయాస్ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై ఏ ఎమ్ ఫెరొజ్ నిర్మాతగా, శంభో శంకర ఫేం శ్రీధర్ ఎన్ డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం ప్రొడక్షన్ నంబర్ 1 నేడు పూజా కార్యక్రమాల తో ప్రారంభం అయింది. అయితే ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ్యురాలు, ఏపీఐఐసీ ఛైర్మన్, ప్రముఖ నటి రోజా సెల్వమణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఒక క్రేజీ హీరో, హీరోయిన్ కాంబినేషన్ లో ఈ చిత్రం అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే గతంలో దర్శకుడు శ్రీధర్ శకలక శంకర్ తో శంభో శివ శంభో సినిమా తో కమర్షియల్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే మరొకసారి వినూత్నంగా కథను ప్రజెంట్ చేసేందుకు సిద్ధం అయ్యారు అంటూ నిర్మాత ఏ ఎమ్ ఫెరోజ్ తెలిపారు.

అయితే మా నదీయాస్ ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ తొలి సినిమా తో దర్శకుడు శ్రీధర్ సక్సెస్ అందిస్తారు అనే నమ్మకం ఉందని తెలిపారు. అయితే ఎంతో బిజిగా ఉన్నప్పటికి, మా ప్రొడక్షన్ నంబర్ వన్ సినిమా ఓపెనింగ్ కి విచ్చేసి, అందరికీ శుభాశీస్సులు అందించిన ఏపీఐఐసి ఛైర్మన్, శాసన సభ్యులు రోజా గారికి మా యూనిట్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని అన్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తామని అన్నారు.

సంబంధిత సమాచారం :