ఆకాశ్ పూరి, కేతికలతో రొమాంటిక్ ముచ్చట్లు పెట్టిన ప్రభాస్..!

Published on Oct 27, 2021 2:46 am IST

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి, కేతికా శర్మ కలిసి నటిస్తున్న చిత్రం “రొమాంటిక్”. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూరి శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించిన ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా భాగమయ్యాడు. ఆకాశ్ పూరి, కేతికలను తనదైన స్టైల్‌లో ఇంటర్వ్యూ చేశాడు.

* రొమాంటిక్ సినిమా ఎగ్జైటింగ్‌గా ఉందా అని ప్రభాస్ అడగ్గా చాలా ఎగ్జైటింగ్‌గా అనిపిస్తుందని ఆకాశ్, కేతిక చెప్పుకొచ్చారు. సినిమా మంచి ఇంటెన్స్ లవ్ స్టోరీ అని, సినిమా షూటింగ్ అంతా దాదాపు గోవాలోనే జరిగిందని అన్నారు.

* సినిమా ఎలా వచ్చింది అని ప్రభాస్ అడగ్గా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుంచి అయితే సూపర్ హిట్ టాక్ వచ్చిందని, సినిమాపై చాలా కాన్‌ఫిడెంట్‌గా ఉన్నామని ఆకాశ్ చెప్పాడు.

* డైరెక్టర్ గురుంచి ప్రభాస్ అడగ్గా అనిల్ పాదూరి ఫస్ట్ టైం డైరెక్షన్ అని, ఇంతకు ముందు ఆయన వీఎఫ్ఎక్స్ డైరెక్టర్‌గా చేసేవాడని ఆకాశ్ చెప్పగా, అనిల్ పాదూరి గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందని, చాలా కూల్‌గా ఉంటాడని, తనకు ఏదైతే కావాలో అలానే షూట్ చేయించేవాడని, ఆ విషయంలో చాలా క్లియర్‌గా ఉండేవాడని కేతిక చెప్పింది.

* రమ్యకృష్ణ గారితో వర్క్ చేయడం ఎలా ఉందని ప్రభాస్ అడగ్గా ఆమెను చూసి చాలా నేర్చుకున్నానని, టేక్‌కి ముందు ఎలా ఉన్నా, యాక్షన్ చెప్పగానే ఆమె నటన చాలా నచ్చిందని ఆకాశ్ అన్నాడు. ఇక “నువ్వు లేకపోతే బ్రతకలేను” అనే సాంగ్‌ని ప్రభాస్ కోసం కేతిక పాడింది.

* నీకు ఎలాంటి రోల్స్ చేయాలని ఉందని ప్రభాస్ ఆకాశ్‌ని అడగ్గా నాకు మీ బుజ్జిగాడు అంటే చాలా ఇష్టమని మీ ఆటిట్య్యూడ్, క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుందని అన్నాడు. బుజ్జిగాడు సినిమాలోని డైలాగులను ఆకాశ్ చాలా చక్కగా చెప్పాడు.

ఇకపోతే మీరు మా సినిమాని ఖచ్చితంగా చూడాలని ప్రభాస్‌ని ఆకాశ్, కేతిక కోరగ్గా ప్లాన్ చేయండి చూద్దాం అని ప్రభాస్ అన్నారు. అంతేకాకుండా మీ బిజీ షెడ్యూల్‌లో మా కోసం సమయం ఇచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని అన్నారు.

సంబంధిత సమాచారం :