రెండో షెడ్యూల్ కోసం రెడీ అవుతున్న రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ !

Published on Feb 2, 2019 9:11 am IST

బాలు ద‌ర్శక‌త్వంలో త్రిదా చౌద‌రి, ధ‌న్య బాల‌కృష్ణ‌, సిద్ధి ఇద్నాని, కొమ‌లి ప్ర‌సాద్ ప్రధాన పాత్రల్లో బ్లాక్ అండ్ వైట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ పై ప్రొడ‌క్షన్ నెం.1గా కొత్త చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. హిమ బిందు వెల‌గ‌పూడి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా తాజాగా ఈ చిత్రం నిన్నటితో ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ‘మ‌హాన‌గ‌రంలో నివ‌సిస్తూ స్వ‌తంత్య్ర భావాలున్న న‌లుగురు అమ్మాయిల‌కు సంబంధించిన క‌థే ఈ చిత్రం.

కాగా ఆ నలుగురు అమ్మాయిల పాత్రల్లో త్రిదా చౌద‌రి, ధ‌న్య బాల‌కృష్ణ‌, సిద్ధి ఇద్నాని, కొమ‌లి ప్ర‌సాద్ న‌టిస్తున్నారు. కామెడీ ప్ర‌ధానంగా సాగే ఈ సినిమాలో క‌థానుగుణంగా ఉండే ట్విస్ట్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయట. రెండో షెడ్యూల్ కోసం కూడా ఈ చిత్రం రెడీ అవుతుంది. వచ్చే వారం నుండి గోవాలో సెకండ్ షెడ్యూల్‌ను చిత్రీక‌రించనున్నారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి మే నెల‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :