ఆహా వీడియో లో ప్రసారం అవుతున్న రొమాంటిక్!

Published on Nov 26, 2021 5:00 pm IST


ఆకాష్ పూరి హీరోగా, కేతిక శర్మ హీరోయిన్ గా అనిల్ పాడురీ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం రొమాంటిక్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. అయితే పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి కథ మరియు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. పూరి మార్క్ డైలాగ్స్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి.

ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ఆహా వీడియో లోకి వచ్చేసింది. ఈ చిత్రం ఆహా వీడియో లో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతుంది. రొమాంటిక్ ప్రేమ కధ గా, యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకున్న ఈ చిత్రం లో రమ్య కృష్ణ మరియు ఉత్తేజ్ లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :