అమెజాన్ ప్రైమ్ లో ‘రొమాంటిక్’ ?

Published on Dec 5, 2020 11:27 pm IST

ఆకాష్ పూరి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘రొమాంటిక్’ కూడా ఓటిటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రాబోతుందని తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి డైరెక్షన్ లో రాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఆకాశ్ పూరి సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట.

మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక వచ్చే వారంలో చిత్రబృందం ప్యాచ్ వర్క్ కి సంబంధించిన బ్యాలెన్స్ షూట్ ను హైదరాబాద్‌ లో అన్నపూర్ణ స్టూడియోలో పూర్తి చేయనుంది. ఈ షెడ్యూల్‌ తో సినిమా మొత్తం అవ్వనుంది.

సంబంధిత సమాచారం :

More