రొమాంటిక్ థ్రిల్లర్ గా ’పెన్సిల్’.!

9th, April 2016 - 01:12:59 PM

pencil
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సోదరి కొడుకైన జి.వి.ప్రకాష్ కుమార్ మొదట సంగీత దర్శకుడిగా పరిచయమైన ఆ తరువాత తమిళ్ ’డార్లింగ్’ సినిమా ద్వారా మొదటి సారి పూర్తిస్థాయి నటుడిగా మారి హిట్ కొట్టాడు. ఆ తరువాత వచ్చిన ’త్రిష లేదా నయనతార’ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా ఇప్పుడు మళ్ళీ ’పెన్సిల్’ అంటూ మరో సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఉగాది రోజున హీరో సూర్య చేతుల మీదుగా విడుదలైన ‘పెన్సిల్’ ట్రైలర్ కు మంచి అప్లాజ్ వచ్చింది. ఈ సినిమాలో ప్రకాష్ సరసన తెలుగమ్మాయి శ్రీ దివ్య హీరోయిన్ గా నటిస్తున్నది.

రొమాంటిక్ థ్రిల్లర్ గా వస్తున్న ‘పెన్సిల్’ సినిమా మర్డర్ నేపథ్యంగా సాగుతుంది. మొదట్లో ప్రేమకథ గా ప్రారంభం అయినా తరువాత ఓ హత్య జరగడంతో కథ ఉత్కంఠం గా మారుతుందని తెలిసింది. గౌతమ్ మీనన్ దగ్గర సహాయకుడిగా పనిచేసిన మణి నాగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తమిళ్, తెలుగు భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల అవుతున్న ఈ సినిమాని తెలుగులో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.